నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పికెట్ ఎమ్మెల్యే కార్యాలయంలో సికింద్రాబాద్ గణేశ్ ఆలయ కమిటీ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆయనతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.