పరీక్షల ఫీజు చెల్లింపులకు గడువు
కృష్ణా: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి జిల్లాల్లోని డిగ్రీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ విద్యార్థుల పరీక్షల ఫీజు ఈ నెల 21 లోపు చెల్లించాలని వర్సిటీ అధికారులు తెలిపారు. 2025-26 వార్షిక సంవత్సర విద్యార్థులు రూ.200 ఆపరాధ రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో 28 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో 30వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని చెప్పుకొచ్చారు.