'బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం'

'బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం'

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సెక్రటరీ ఇందిరా మాట్లాడుతూ.. భూ ఆక్రమణ, బాల్య వివాహాలు, వరకట్న నిషేధ, వినియోగదారుల చట్టం, గృహహింస, మానవ హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, ర్యాగింగ్, రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు.