బస్సు ప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి
SDPT: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మృతులకు ప్రగడ సంతాపం ప్రకటించారు.