'మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి'
KNR: జిల్లావ్యాప్తంగా నిర్వహించే మేడే వారోత్సవాలను ఏప్రిల్ 23 నుంచి మే 1 వరకు విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి కార్మికులను కోరారు. హుజూరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఎర్రజెండా ఎగురవేయాలని, ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.