వికలాంగురాలికి రాంప్, వీల్‌చైర్‌తో సహాయం
GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో గుడివాడ, కోపల్లెలో పింఛన్ కార్యక్రమంలో గుర్తించిన సమస్యకు పరిష్కారం చూపారు. నేనావత్ మంగా బాయి ఇంటి వద్ద రాంప్ ఏర్పాటు చేసి, రోటరీ క్లబ్ ద్వారా వీల్‌చైర్ అందించారు. సర్పంచ్ యడ్లపాటి రాకేష్ సహకారంతో జరిగిన ఈ సేవా కార్యక్రమం లబ్ధిదారురాలి జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.