మంత్రి నారాయణ సంచలన నిర్ణయం

మంత్రి నారాయణ సంచలన నిర్ణయం

NLR: నెల్లూరు న‌గ‌రం బోడిగాడి తోటలో ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ ప‌ర్య‌టించారు. సమాధుల తోట పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అన్ని హంగులతో సుందరమైన వాతావరణం పార్కులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో పేదలే అధికంగా ఉండడాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హల్ అద్దె ఒక్క రూపాయి మాత్రమే తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.