వజ్రోత్సవలకు శ్రీకాకుళం సిద్ధం: కలెక్టర్

SKLM: జిల్లాలో ఈ నెల 13, 14, 15 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. 13న ప్రారంభ సభ, శోభాయాత్ర, 14న సాంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 15న స్వాతంత్ర దినోత్సవంతో పాటు ముగింపు వేడుకలు జరుగుతాయి. జిల్లా సాంస్కృతిక, చారిత్రక విశేషాలతో కూడిన ప్రత్యేక సావనీర్ కూడా ఆవిష్కరించనున్నారు.