VIDEO: 'గ్రీన్ అంబాసిడర్లకు కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలి'
VZM: కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలని కోరుతూ ఎస్.కోట ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రీన్ అంబాసిడర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ.. గ్రీన్ అంబాసిడర్లను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని తదితర డిమాండ్లతో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.