ఘనంగా AISF 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మేడ్చల్: బోడుప్పల్‌లో AISF జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 90వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఉప్పల్ డిపో కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ జెండా ఎగురవేశారు. 1936 ఆగస్టు 12న దేశంలోనే తొలి విద్యార్థి సంఘంగా AISF ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.