జిల్లాలో 1,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం

జిల్లాలో 1,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం

AKP: వర్షాలకు జిల్లాలో 1,500 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనకాపల్లి మండలంలోనే అత్యధికంగా 600 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అలాగే, శారద నదికి పలుచోట్ల గండ్లు పడిన కారణంగా రాంబిల్లి, మునగపాక మండలాల్లో కూడా వరి పంటకు భారీ నష్టం కలిగినల్లు వెల్లడించారు.