VIDEO: విద్యార్థులకు 'ఓపెన్ హౌస్' అవగాహన
E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం విద్యార్థులకు 'ఓపెన్ హౌస్' నిర్వహించారు. డీఎస్పీ సుభద్ర, ఇన్స్‌స్పెక్టర్ మంగాదేవి పోలీసు వ్యవస్థ పనితీరు, ఆయుధాల వినియోగంపై వివరించారు. చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వారు తెలిపారు. పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివరాలు తెలుసుకున్నారు.