అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేత

VZM: ప్రజాస్వామ్యంలో ఓట్ల దుర్వినియోగాన్ని ఎత్తిచూపినందుకు రాహుల్ గాంధీ అరెస్టు అన్యాయమని కాంగ్రెస్ నేతలు ఖండించారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె. సమీర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన వరం. దీన్ని భయపెట్టి అణచివేయడం మోడీ ప్రభుత్వానికి సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా మోదీ తన బుద్ధి మార్చుకోవాలన్నారు.