రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో రేపు జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక పట్టణంలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరగనుందని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.