కుళాయిలు ఉన్నా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు

కుళాయిలు ఉన్నా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు

ASR: మారేడుమిల్లి మండలంలోని కొత్త కాలని గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కుళాయిలు ప్రతి ఇంటి వద్ద ఉన్నా కూడా ప్రజలకు తాగునీరు అందటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. నీటి సరఫరా వద్ద పనిచేస్తున్న ఉద్యోగి సరిగా విధులు నిర్వహించకపోవటం వలన ఇలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు తెలియచేస్తున్నారు.