VIDEO: యువకుడి అనుమానాస్పద మృతి
SRPT: చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ రత్నవత్ మణి భార్గవ్(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈరోజు రోళ్లబండ తండా దారిలో మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో చాకు, తాడు ఉండటం, మెడకు ఉరి వేసిన గుర్తులుండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.