VIDEO: రోడ్డు ప్రమాదంలో మహిళ కాలు నుజ్జునుజ్జు
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో మహిళ కాలు నుజ్జునుజ్జుగా మారి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన మహిళను తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.