విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు

విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు

AKP: రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వద్ద వీరి కోసం పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. పదవ తరగతి చదువుతున్న జస్వంత్, హిమతేజ, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు చెట్టు ఎక్కి గోడ దూకి పారిపోయారు.