కాంగ్రెస్ ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
TG: బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ MP చామల కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అంతరార్థం ఉందని, పార్టీలో ముసలం మొదలైందని పేర్కొన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి చేరిక హరీష్ రావుకు ఇష్టం లేదని, అందుకే కేసీఆర్ సభకు ఆయన గైర్హాజరయ్యారని విమర్శించారు. BRS మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. ఆయన భవిష్యత్ ప్రణాళికలు బయటపడతాయన్నారు.