గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

VZM: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన తమటపు దేముడుబాబు మద్యానికి బానిసై అప్పులు చేసి వాటిని తీర్చలేక గత నెల గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు విశాఖ కెజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.