'పులి ఆచూకీ లభ్యం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
KKD: ప్రత్తిపాడు(M) బౌరువాక సమీపం చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆ ప్రదేశాన్ని అటవీశాఖ రాష్ట్ర సలహాదారులు మల్లికార్జునరావు పరిశీలించారు. పులి సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించిందని, 15 పశువులపై దాడి చేసిందని తెలిపారు. పరిసర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాంకేతిక పర్యవేక్షణతో పులిని పట్టుకుంటామని చెప్పుకొచ్చారు.