BRS మహిళా కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుడి దాడి
MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలో BRS కార్యకర్తపై గురువారం కాంగ్రెస్ నాయకుడు దాడి చేసి గాయపరిచాడు. పిట్టల రమ్య స్థానిక పంచాయతీ ఎన్నికల్లో BRS తరుపున ప్రచారంలో పాల్గొంటుంది. దీంతో కాంగ్రెస్‌కి చెందిన అతిమల సురేష్ అనే వ్యక్తి రమ్యపై ద్వేషంతో ఆమె ఇంటికి వెళ్లి సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేయగా రమ్య గాయపడింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.