మాడుగులలో 50 వేల సంతకాల సేకరించిన మాజీ డిప్యూటీ సీఎం

మాడుగులలో 50 వేల సంతకాల సేకరించిన మాజీ డిప్యూటీ సీఎం

VSP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాడుగుల నియోజకవర్గంలో 50,000 సంతకాలు సేకరించినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడీ ముత్యాల నాయుడు తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా కార్యాలయానికి అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.