బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

TG: బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానెల్‌ ఏర్పాటు చేశారు. వైద్య బృందం వీటిని విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చనున్నారు. ఈ తరలింపు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.