బ్రిటిష్ న్యాయవాదిచొరవ.. ఉరి శిక్ష రద్దు

NLG: తెలంగాణ సాయుధ పోరాటంలో గార్లపాటి రఘుపతిరెడ్డి ఉరిశిక్ష రద్దు కీలక ఘట్టం. అక్కినేపల్లి దొర హత్య కేసులో ఆయన భువనగిరిలో అరెస్టయ్యారు. ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిపై విదేశీ పత్రికలు సైతం కథనాలు ప్రచురించాయి. ఇంగ్లాండ్ న్యాయవాది డి.ఎన్.ప్రిట్ అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను కలవడంతో ఉరిశిక్ష రద్దై, యావజ్జీవ కారాగారశిక్షగా మారింది.