డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
TPT: తోట్టంబేడులో గురువారం డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం DY.CM పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిరాజా నాయుడు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెంచయ్య నాయుడు, డీడీవో సుస్మిత, కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.