మండల నూతన కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవం
NDL: సీపీఐ పార్టీ మిడుతూరు మండల కార్యదర్శిగా మేకల శేఖర్ కమిటీ సభ్యులు ఆమోదంతో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పోరాటాలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.