తుఫాన్ నష్ట అంచనా నివేదిక సమర్పించాలి: అ.కలెక్టర్
KMM: నిర్ణీత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మొంథా తుఫాన్ నష్టం అంచనాల నివేదికలు తయారీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. తుఫాన్ కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలు నిర్ణీత నమూనాలో నవంబర్ 6 నాటికి అందించాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.