బాధ్యతలు స్వీకరించిన గంటలోనే ట్రాన్స్‌ఫర్
విశాఖ హార్బర్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన వివేకానందను తిరిగి శ్రీకాకుళం డీఎస్పీగా బదిలీ చేశారు. శ్రీకాకుళంలోనే పనిచేస్తూ హార్బర్ ఏసీపీగా బదిలీ కాగా.. గురువారం మధ్యాహ్నం విధుల్లో చేరారు. చేరిన కొద్ది గంటల్లోనే ఆయనను మళ్లీ శ్రీకాకుళం డీఏస్పీగా ట్రాన్స్‌ఫర్ చేయడం గమనార్షం.