నేడు OUకు సీఎం రేవంత్.. కవిత ట్వీట్
RR: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 'X'లో ట్వీట్ చేశారు. ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో నిరుద్యోగులను ఆశపెట్టి గద్దెనెక్కిన సీఎం, రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? అని ఆమె ప్రశ్నించారు. ఓయూ గడ్డమీద యువత ఆకాంక్షలపై స్పష్టత ఇవ్వాలని కవిత అందులో డిమాండ్ చేశారు.