యాదాద్రీశుడి కార్తీక మాస ఆదాయం ఎంతంటే ?
BHNG: యాదగిరిగుట్ట పంచనారసింహుల క్షేత్రంలో కార్తీక మాసం సంబరాలు గురువారం ముగిశాయి. వివిధ విభాగాల నుంచి రూ. 17.62 కోట్ల ఆదాయం చేకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. గతేడాది కన్నా రూ. 3.31 కోట్లు అధికంగా వచ్చిందన్నారు. 30 రోజుల పాటు 25,268 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించగా రూ. 2.52 కోట్లు, ప్రసాదాల విక్రయంతో రూ.3.27 కోట్లు ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.