నారాయణ విద్యా సంస్థలకు అనుమతులు లేవు: DEO
NZB: డిచ్‌పల్లి మండలం కేశపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న నారాయణ గ్రూప్ఆఫ్ స్కూల్‌కి ఏలాంటి అనుమతులు, గుర్తింపు లేవని డీఈవో అశోక్ కుమార్ స్పష్టంచేశారు. ఇంత వరకు నారాయణ గ్రూప్స్‌కు జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి మంజూరు ఉత్తర్వులు అందించలేదన్నారు. ఈ విషయాన్నితల్లిదండ్రులు గమనించాలని, అనుమతులులేని ప్రైవేట్ పాఠశాలలో పిల్లల అడ్మిషన్లు చేయరాదని ప్రకటనలో సూచించారు.