మెదక్ ఎంపీగానే ఇందిరా హత్య.!
MDK: ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31న హత్యకు గురయ్యే నాటికి మెదక్ ఎంపీగానే ఉన్నారు. ఇక్కడే నుంచి గెలిచి ప్రధాని అయ్యారు. ఎంపీగా ఆమె పలు సందర్భాల్లో జిల్లాలో పర్యటించారు. 1984 జులై 19న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల సదస్సుకు కూడా ఆమె హాజరయ్యారు. మెదక్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, తదితర పనులకు శంకుస్థాపన చేశారు.