'ఇసుక అక్రమార్కులకు అడ్డుకట్ట వేయండి'
BDK: బూర్గంపాడు మండలం బుడ్డగూడెంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు ఇవాళ తెలిపారు. వరుసగా రెండు రోజులు సెలవు కావడంతో ఇష్టారాజ్యంగా పట్టపగలే ఎదెచ్చగా ఇసుక మాఫియా కొనసాగుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయకపోతే భూగర్భ జలాలు అంతరించిపోయే అవకాశం ఉందని వాపోయారు.