పాఠశాలలో తల్లిదండ్రులకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

పాఠశాలలో  తల్లిదండ్రులకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

KNR: కరీంనగర్ పట్టణంలోని కిడ్స్ గురుకుల్ స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం స్కూల్ చైర్మన్ అక్కినపల్లి అనిల్ కుమార్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మండపాలలో సనాతన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా పాటలు, నృత్యాలు ఉండాలని సూచించారు