షాపింగ్ రూమ్‌లకు భూమిపూజ ఎమ్మెల్యే
ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి ఇవాళ పట్టణంలో రూ. 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న షాపింగ్ రూమ్‌లకు భూమిపూజ చేశారు. జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ వెనుక ఈ నిర్మాణాలకు ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, తెదేపా-జనసేన-భాజపా కూటమి నాయకులు, జేసీ అభిమానులు పాల్గొన్నారు.