VIDEO: రైతులు పండ్ల సాగుకు దరఖాస్తు చేసుకోవాలి

BPT: కొరిశపాడు మండలంలోని రైతులందరూ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల సాగుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీవో గాయత్రి లక్ష్మి సోమవారం తెలిపారు. పంట పొలాలలో గుంటలు తీసేందుకు ఉపాధి కూలీలు అందుబాటులో ఉంటారని ఆమె చెప్పారు. వీరికి ఉపాధి హామీ ద్వారా ప్రభుత్వమే నగదు చెల్లిస్తుందని గాయత్రి లక్ష్మి తెలియజేశారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.