భూ కబ్జా విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు
NGKL: ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూరు స్టేజి వద్ద హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై 39 గుంటల వ్యవసాయ పొలం కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహసీల్దార్‌కు బాధితులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సంత జరుగుతోందని ఆ భూమిని గ్రామపంచాయతీకి కేటాయించాలన్నారు.