వడదెబ్బతో మత్స్య కార్మికుడు మృతి

SRPT: కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన గుంటి వెంకటరమణ(58) ఆదివారం చౌటకుంటలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉండటంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. సాయంత్రం అయిన లేవకపోవడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ ని పిలవగా ఆయన పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వెంకట రమణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.