193 మద్యం బాటిళ్లు స్వాధీనం

SKLM: రణస్థలం మండలంలోని సంచాం గ్రామం జంక్షన్ వద్ద సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ముగ్గురు వ్యక్తుల నుంచి 193 మద్యం బాటళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఒక పల్సర్ బైకును సీజ్ చేసినట్లు ఎస్సై చిరంజీవి స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించినట్లు వెల్లడించారు.