ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం

కోనసీమ: కె. గంగవరంలో సహాయ వ్యవసాయ సంచాలకులు నాగ కుమార్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ విధానంపై శాస్త్రీయతను వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పంట వృత్తికారకాలు, చీడ పేడల నివారణకు కషాయాల తయారీ విధానాలను ఆయన రైతులకు వివరించారు.