'అక్రిడేషన్ అవకతవకల ఫిర్యాదులపై విచారణ చేయండి'
ATP: జిల్లాలో అక్రిడేషన్ మంజూరులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీనియర్ జర్నలిస్టులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తినే జీవనాధారం చేసుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. జర్నలిజం నమ్ముకున్న తమకు న్యాయం చేయాలన్నారు.