ఉచిత కుట్టు శిక్ష నాకేంద్రం ప్రారంభం
NTR: బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన నేత చలమలశెట్టి రమేష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వీరవల్లి గ్రామంలో 173 మందికి శిక్షణ అందించి మహిళలను స్వావలంబన దిశగా నడిపిన మమతల పందిరి సేవలు శ్లాఘనీయమన్నారు.