ALERT: నవంబర్ 4న మరో అల్పపీడనం
TG: మొంథా తుఫాన్ నుంచి పూర్తిగా బయట పడకముందే.. తెలుగు ప్రజలకు మరో షాక్ తగలనుంది. నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు, గాలివానలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తాయని సూచించింది.