'ఛాంపియన్'తో నందమూరి హీరో రీఎంట్రీ

'ఛాంపియన్'తో నందమూరి హీరో రీఎంట్రీ

సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు నిర్మాత నందమూరి త్రివిక్రమరావు తనయుడు కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ వెండితెరపై అడుగుపెడుతున్నారు. దాదాపు 35ఏళ్ల తర్వాత 'ఛాంపియన్'లో రాజిరెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. కళ్యాణ్ చక్రవర్తి.. 'తలంబ్రాలు', 'ఇంటి దొంగ', 'మేనమామ', 'రౌడీ బాబాయ్', 'రుద్రరూపం' వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు.