నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

బాపట్ల: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామం పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి వినియోగించుకోవలసిందిగా కోరారు.