శ్రీశైలంలో ఘనంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
NDL: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవారికి ఘనంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ఆలయ పురవీధిలో పుష్ప పల్లకిలో స్వామి, అమ్మవారు విహరించారు. పుష్ప పల్లకిలో కొలువైన స్వామివార్లను భక్త జనం దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.