నిత్యావసరాల ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. నిత్యావసర ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వం వద్ద 222 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 380 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయని వెల్లడించింది. అలాగే వివిధ దేశాల నుంచి నిత్యావసర వస్తువులు దిగుమతులు అవుతున్నట్లు తెలిపింది.