మందకొడిగా ప్రారంభమైన పోలింగ్

మందకొడిగా ప్రారంభమైన పోలింగ్

PDPL: ధర్మారం మండలంలోని 29 గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. నందిమేడారంలో ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ లోనికి మొబైల్ ఫోన్లను సైతం అనుమతించడం లేదు.