నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్ మేళా రేపే
KKD: జిల్లా కేంద్రంలో ఉపాధి కార్యాలయంలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో బీఎస్సీ కెమిస్ట్రీ, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ జిరాక్స్‌లతో గురువారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలన్నారు.